ఏషియన్ గేమ్స్ విజేతలకు సీఎం వైయస్ జగన్ అభినందన
7 Oct, 2023 11:23 IST
తాడేపల్లి: చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో భారత్, ఏపీకి చెందిన క్రీడాకారులు పతకాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలో పతకాలు సాధించిన విజేతలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
‘ఏసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన విజేతలకు శుభాకాంక్షలు. ఆర్చర్ అటానుదాస్, బొమ్మదేవర ధీరజ్‌తోపాటు, రజత పతకం సాధించిన తుషార్ షెల్కేలకు అభినందనలు. మీ విజయాలతో ఏపీతోపాటు దేశమంతా గర్వపడుతోంది. బొమ్మదేవర ధీరజ్ ఒక మెరిసే నక్షత్రం అంటూ సీఎం వైయస్ జగన్ మెచ్చుకున్నారు. మన తెలుగు జెండా రెపరెపలాడుతోందన్నారు.’ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.