`పద్మ` పురస్కార గ్రహీతలకు సీఎం అభినందనలు
26 Jan, 2022 09:41 IST
తాడేపల్లి: ప్రతిష్టాత్మక పద్మ పురస్కార గ్రహీతలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కడం తెలుగువారందరూ గర్వించదగ్గ విషయమని సీఎం వైయస్ జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పద్మశ్రీ పురస్కారాలను అందుకోనున్న గరికపాటి నరసింహారావు, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్‌హసన్‌లకు సీఎం అభినందనలు తెలిపారు. అదే విధంగా పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన తెలుగు ప్రముఖులు భారత్ బయోటెక్ డా. కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభినందనలు తెలిపారు.