పార్టీ నేతలకు సీఎం వైయస్ జగన్ అభినందనలు
2 Nov, 2021 14:24 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్ దాసరి సుధ, అత్యధిక మెజార్టీతో విజయం సాధించేందుకు కృషి చేసిన పార్టీ నేతలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభినందించారు. అదే విధంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలిశారు.