జాతీయ చలన చిత్ర అవార్డు గ్రహీతలకు సీఎం అభినందనలు
22 Mar, 2021 18:12 IST
తాడేపల్లి: జాతీయ చలన చిత్ర అవార్డు గ్రహీతలను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగు విభాగంలో అవార్డు గ్రహీతలుగా నిలిచిన వారిని సీఎం వైయస్ జగన్ అభినందించారు. సినీ నిర్మాతలు, డైరెక్టర్లు, తారాగణం, సిబ్బందికి తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ పత్రికా ప్రకటన విడుదలైంది.