వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులను అభినందించిన సీఎం వైయస్ జగన్
13 Dec, 2022 16:52 IST
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, అధికారులను అభినందించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను మంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, అధికారులు కలిసి రాష్ట్రానికి వచ్చిన అవార్డులను చూపించారు. ఇటీవల వారణాసిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో రాష్ట్రానికి వచ్చిన అవార్డులను అందుకున్న మంత్రి రజని, కృష్ణబాబు. టెలికన్సల్టేషన్ విభాగంలో, విలేజ్ హెల్త్ క్లీనిక్‌ల విషయంలో కేంద్రం నుంచి ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ రెండు అవార్డులు గెలుచుకుంది.