యువ ఐఏఎస్ అధికారులకు సీఎం అభినందనలు
23 May, 2020 17:15 IST
తాడేపల్లి: ఏపీ క్యాడర్‌కు చెందిన 10 మంది ఐఏఎస్‌లకు అసిస్టెంట్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇచ్చారు. యువ ఐఏఎస్ అధికారులను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. శనివారం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రొబేషనరీ ఐఏఎస్ 2019 బ్యాచ్ భేటీ అయ్యింది. నిబద్ధత గల అధికారులుగా ప్రజలకు మంచి సేవలందించాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సీఎం వైయస్ జగన్ ఐఏఎస్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఐఏఎస్‌లదే కీలకపాత్ర అన్నారు. ఐఏఎస్‌లు చిత్తశుద్ధితో పని చేయాలని సీఎం వైయస్ జగన్ సూచించారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. మహిళల రక్షణ కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా దిశ చట్టంతో పాటు ప్రత్యేక పోలీస్‌స్టేషన్ల ఏర్పాటును యువ ఐఏఎస్‌లకు సీఎం వైయస్ జగన్ వివరించారు.