ములాయం మృతికి సీఎం వైయస్ జగన్ సంతాపం
10 Oct, 2022 11:13 IST
తాడేపల్లి: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో ములాయం కీలక పాత్ర పోషించారని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషిచేశారని గుర్తుచేశారు. ములాయం మృతికి సంతాపం తెలిపిన సీఎం వైయస్ జగన్.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.