బచ్చుల మృతికి సీఎం వైయస్ జగన్ సంతాపం
3 Mar, 2023 17:23 IST
విశాఖ: ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (65) అకాల మరణం పట్ల సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బచ్చుల అర్జునుడు జనవరి 28వ తేదీ తెల్లవారుజామున తీవ్ర గుండెపోటుకు గురికాగా విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న అర్జునుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.