సోలి సోరబ్జీ మృతి పట్ల సీఎం వైయస్ జగన్ తీవ్ర విచారం
30 Apr, 2021 12:08 IST
తాడేపల్లి: న్యాయవాది సోలి సోరబ్జీ మృతి పట్ల సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సోలి సోరబ్జీ అత్యుత్తమ న్యాయవాది, మేధావి అని సీఎం వైయస్ జగన్ కీర్తించారు. సోరబ్జీ వాదనలు మానవ హక్కుల పరిరక్షణపై తీవ్ర ప్రభావం చూపాయని సీఎం వైయస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.