కల్నల్ సంతోష్ మరణం పట్ల సీఎం వైయస్ జగన్ సంతాపం
17 Jun, 2020 10:23 IST
తాడేపల్లి: భారత్, చైనా బలగాల మధ్య లడఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన ఘర్షణల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఈ ఘటనపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు బిడ్డ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడని కీర్తించారు. సంతోష్ త్యాగం వెలకట్టలేనిదని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.