చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపిన సీఎం వైయస్‌ జగన్‌

22 Mar, 2020 17:20 IST


తాడేపల్లి:  కోవిడ్‌-19 (కరోనా వైరస్) నియంత్రణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో ‘జనతా కర్ఫ్యూ’  సందర్భంగా ప్రజలు ఇంట్లో ఉంటే..వారి కోసం బయట పని చేసిన సిబ్బందికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌, మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌, ఉన్నతాధికారులు చప్పట్లు కొట్టారు. జనతా కర్ఫ్యూ విజయవంతం కావడం పట్ల సీఎం వైయస్‌ జగన్‌  సంతోషం వ్యక్తం చేశారు.