నిర్వాసితులకు న్యాయం చేస్తాం
14 Dec, 2020 12:18 IST
పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు నీరు అందిస్తామని, నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయన్నారు.
కాగా, పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించిన సీఎం.. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. స్పిల్ వేపై నడుచుకుంటూ వెళ్లి పనుల పురోగతిని ఉన్నతాధికారులను అడిగి తెలుసుకొని, ఫొటో గ్యాలరీని వీక్షించారు. కాఫర్ డ్యామ్‌ను పరిశీలించారు.