తక్షణ చర్యలు తీసుకోండి
1 Aug, 2020 15:41 IST
విశాఖ: విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డులో చోటుచేసుకున్న ప్రమాదంపై సీఎం వైయస్ జగన్ ఆరా తీశారు. ఘటన వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం.. తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశించారు. క్రేన్ కుప్పకూలిపోవడంతో 11 మంది కార్మికులు మృతిచెందారు. కార్మికుల మృతిపై సీఎం వైయస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై యాజమాన్యంతో చర్చించి వివరాలను సేకరించాలని సూచించారు.