పార్లమెంట్ ఆఫీసులో ఘనంగా వైయస్ జగన్ జన్మదిన వేడుకలు
21 Dec, 2021 12:37 IST
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు న్యూఢిల్లీలోని పార్లమెంట్ కార్యాలయంలో ఎంపీలు ఘనంగా నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభా పక్ష నాయకులు పీవీ మిధున్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్‌లోని పార్టీ కార్యాలయంలో ఎంపీలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలలో పార్టీ పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు.