గవర్నర్ ప్రమాణస్వీకారోత్సవానికి సీఎం వైయస్ జగన్ హాజరు
24 Feb, 2023 11:09 IST
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి, వైయస్ భారతి దంపతులు, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్‌తో కలిసి ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటో సెషన్ జరిగింది. అనంతరం రాజ్‌భవన్‌లో హై టీ కార్యక్రమం నిర్వహించారు.