నూతన వధూవరులకు సీఎం వైయస్ జగన్ ఆశీర్వాదం
13 Jun, 2022 11:02 IST
నెల్లూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి తనయుడి వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఆదివారం కావలి మండలం గౌరవరం వద్ద ఉన్న రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్‌కు సీఎం వైయస్ జగన్ హాజరై వరుడు బాల సాకేత్‌రెడ్డి, వధువు మహిమలను ఆశీర్వదించారు. సీఎం వైయస్ జగన్‌తో పాటు మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి తదితర నేతలు వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు.