నూతన వధూవరులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆశీర్వాదం

13 Feb, 2020 18:07 IST

ఏలూరు: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు మనవడి వివాహ మహోత్సవానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో భీమవరం చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌ వీఎస్‌ఎస్‌ గార్డెన్‌లో జరిగే వివాహానికి హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం తాడేపల్లికి హెలికాప్టర్‌లో బయల్దేరారు.