ఆఫీస్ సబార్డినేట్ పెళ్లికి సీఎం దంపతులు
5 Nov, 2020 14:48 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న రవి ప్రసాద్ వివాహానికి సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. తాడేపల్లి సీఎస్‌ఆర్ కల్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకకు హాజరైన సీఎం వైయస్ జగన్, వైయస్ భారతీరెడ్డిలు నూతన వధూవరులను ఆశ్వీరదించారు. ఈ వివాహా వేడుకకి సీఎం దంపతులతో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తమ వివాహానికి ముఖ్యమంత్రి హాజరు కావడంపట్ల రవి ప్రసాద్‌తో పాటు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.