శ్రీశారదా పీఠానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్
9 Feb, 2022 12:16 IST
విశాఖపట్నం: శ్రీ శారదా పీఠానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. గన్నవరం నుంచి విశాఖ ఎయిర్‌పోర్టు చేరుకున్న సీఎం వైయస్ జగన్.. రోడ్డు మార్గాన శ్రీ శారదా పీఠానికి చేరుకున్నారు. పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠానికి చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు అవంతి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే అదీప్ రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. సీఎం వెంట తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. కాసేపట్లో శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు.