రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం
28 Dec, 2020 11:43 IST
చిత్తూరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి శ్రీకాళహస్తి పర్యటనకు బయల్దేరిన సీఎం వైయస్ జగన్ కొద్దిసేపటి క్రితమే రేణిగుంటకు చేరుకున్నారు. సీఎం వైయస్ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో సీఎం .. ఊరందూరు చేరుకొని ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అనంతరం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, వైయస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.