ఆ నలుగురికి సీఎం వైయస్ జగన్ సత్కారం
3 Dec, 2021 15:23 IST
చిత్తూరు: ఇటీవల సంభవించిన వరదలకు ప్రాణాలు తెగించి సహాయ చర్యల్లో పాల్గొన్న సహస వీరులను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సత్కరించి, అభినందించారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు - పాడీపేట వద్ద స్వర్ణముఖి నదిపై వరద ఉధృతికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని ఇవాళ సీఎం శ్రీ వైయస్. జగన్ పరిశీలించారు. ప్రాణాలకు తెగించి వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసు కానిస్టేబుల్ ప్రసాద్ సహా మరో ముగ్గురు పౌరులను ముఖ్యమంత్రి అభినందించి, ఆ నలుగురిని సత్కరించారు. అనంతరం చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాలతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో రహదారులు భవనాలు, వ్యవసాయం, ఉద్యానవన, గృహనిర్మాణం, విద్యుత్ శాఖలకు సంబంధించి వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ పరిశీలించారు.