జవాన్ల మృతిపై సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి
5 Apr, 2021 15:34 IST
తాడేపల్లి: ఛత్తీస్‌ఘడ్ ఘటనలో జవాన్ల మృతిపట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు జవాన్లు మృతిచెందారు. ఈ సందర్భంగా జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సీఎం.. ఆ కుటుంబాలను ఆదుకుంటామని హామీనిచ్చారు. విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాన్ రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన జవాన్ శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఆర్థికసాయాన్ని వెంటనే అందించి.. బాసటగా నిలవాలని సీఎంఓ అధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు.