సాలూరులో సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన

25 Aug, 2023 11:15 IST

విజయనగరం: సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శంకుస్థాపన చేశారు. దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, ఎందరో గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు విరబూసేలా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రత్యేక చొరవతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటవుతుంది. సాలూరులో మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో సుమారు రూ.834 కోట్లతో 561.88 ఎకరాల్లో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్రమంత్రి ప్రధాన్, సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. అంతకుముందు సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ లేఅవుట్‌ నమూనాను పరిశీలించారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం రాజ‌న్న‌దొర‌, విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు, అధికారులు పాల్గొన్నారు.