రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయస్ జగన్ ఏరియల్ సర్వే
14 Jul, 2022 17:16 IST
తాడేపల్లి: వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరదలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సాయపడాలని సీఎం వైయస్ జగన్ సూచించారు.