పోలవరంలో సీఎం వైయస్ జగన్ ఏరియల్ సర్వే
8 Aug, 2019 13:30 IST
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్నారు. సీఎం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం గన్నవరం చేరుకున్నారు. వెంటనే ఆయన పోలవరం ఏరియల్ సర్వేకు బయల్దేరారు. కాఫర్ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలిస్తున్నారు. అనంతరం రాజమండ్రిలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు 10 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద నీరు భారీగా వస్తోంది.