ఆరోగ్యం జాగ్రత్త అక్కా...
27 Jan, 2023 15:51 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతిని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ కోలుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం వైయస్ జగన్ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి అక్కా.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని ఆప్యాయంగా సూచించారు. ఇంకా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోండి.మీకు నేనున్నాంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కళావతికి ధైర్యం చెప్పారు.