పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించా
28 Dec, 2022 16:17 IST
న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చించినట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతో పాటు, పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరిన నేపథ్యంలో ప్రధాని గారు సానుకూలంగా స్పందించారని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.