వరద ప్రాంతాల్లో సీఎం వైయస్ జగన్ ఏరియల్ సర్వే
21 Sep, 2019 14:02 IST
కర్నూలు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద వచ్చింది. వరద ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. నంద్యాల, మహానంది, ఆళ్లగడ్డ, తదితర ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తున్నారు. అనంతరం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. వరద ప్రభావం, సహాయ చర్యలు, పునరావాసంపై సీఎం సమీక్షిస్తారు.