దేశ చరిత్రలో ఈ రోజు సుదినం
22 Jul, 2019 17:59 IST
అమరావతిః దేశ,రాష్ట్ర చరిత్రలో ప్రథమం,సుదినం అని ట్విటర్‌లో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవులు,పనులు,సర్వీసుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని వెల్లడించారు. అక్కచెల్లెమ్మలకు 50 శాతం కేటాయించామని ట్విట్ చేశారు. శాశ్వత బీసీ కమిషన్ సహా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా అసెంబ్లీలో బిల్లులు పెట్టామని ట్విటర్‌లో పేర్కొన్నారు.