ఖర్చులకు వెనుకాడవద్దు
16 Apr, 2020 17:53 IST
తాడేపల్లి: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు కేపీ వంశీ, రేవంత్‌కుమార్ మృతదేహాలను ఏపీకి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఖర్చుకు వెనకాడవద్దని సీఎం స్పష్టం చేశారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకు అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ లేఖ కూడా రాశారు.