బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి వైయస్ జగన్‌తోనే సాధ్యం
26 Jan, 2019 14:49 IST
హైదరాబాద్: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడం సంతోషంగా ఉందని గోరంట్ల మాధవ్ అన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో గోరంట్ల మాధవ్ వైయస్‌ఆర్ సీపీలో చేరారు. అనంతరం గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ వైయస్ జగన్ బాటలో నడవాలనే ఉద్దేశంతో పార్టీలో చేరానన్నారు. అనంతపురంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి.. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తానన్నారు. వైయస్ జగన్‌తోనే బడుగు, బలహీనవర్గాలకు మేలు జరుగుతుందన్నారు.