జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు నాన్నా : సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

8 Jul, 2021 12:02 IST

తాడేప‌ల్లి: దివంగత మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 72వ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌యుడు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి భావోద్వేగ ట్వీట్ చేశారు. ``చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం. పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం. మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం. నీ ఆశయాలే నాకు వారసత్వం. ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా.. పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా.. జన్మదిన శుభాకాంక్షలు నాన్నా`` అంటూ త‌న తండ్రిని స్మ‌రించుకున్నారు.