హర్యానా సీఎం ఖట్టర్‌తో ముఖ్యమంత్రి వైయస్ జగన్ భేటీ
19 Apr, 2022 14:25 IST
విశాఖపట్నం: హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విశాఖలోని రుషికొండ పెమ వెల్‌నెస్ రిసార్ట్‌లో ఇరువురు ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హర్యానా సీఎం ఖట్టర్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఘనంగా సత్కరించారు. సీఎం వైయస్ జగన్ వెంట డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు.