వైయస్ జగన్ లాంటి ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శం
తాడేపల్లి: వైయస్ జగన్మోహన్రెడ్డి లాంటి మఖ్యమంత్రి దేశానికే ఆదర్శమని ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య కొనియాడారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆశా మాలవ్య సీఎం వైయస్ జగన్‌ను కలిశారు. అనంతరం ఆశా మాలవ్య మీడియాతో మాట్లాడారు.
నా పేరు ఆశా మాలవ్య, మాది మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా. స్పోర్ట్స్‌లో నేషనల్ ప్లేయర్‌ను. మౌంటైనియరింగ్‌లో నేను రికార్డు హోల్డర్‌ను.ప్రస్తుతం నేను 25వేల కిలోమీటర్ల సంపూర్ణ భారత యాత్ర చేస్తున్నాను. నవంబర్ 1న భోపాల్‌లో నా సైకిల్ యాత్ర ప్రారంభించి నేడు విజయవాడ చేరుకున్నాను. మొత్తం 28 రాష్ట్రాల్లో నా యాత్ర నిర్వహించాలనేది టార్గెట్ ఇప్పటికే 7రాష్ట్రాల్లో నా సైకిల్ యాత్ర పూర్తయింది. భారత దేశం మహిళలకు అంత సురక్షితమైన దేశం కాదని విదేశాల్లో తప్పుడు అభిప్రాయం ఉంది. మహిళలకు భారతదేశంలో పూర్తి భద్రత ఉందని నేను ప్రపంచానికి చాటిచెప్పాలనుకుంటున్నాను. నేను ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డిగారిని కలిశాను. సీఎం వైయస్ జగన్ గారిని కలవడం ఎంతో ఉద్వేగంగా, గర్వంగా ఉంది. దేశం అభివృద్ధితో పాటు మహిళల భద్రతలాంటి విషయాలపై ముఖ్యమంత్రి గారి అభిప్రాయాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఏపీలో మహిళల భద్రత కోసం దిశా యాప్ ప్రవేశపెట్టారు. నేను దిశా యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిని చెక్ చేశాను. దిశా యాప్ ఎంతో గొప్పగా పనిచేస్తోంది. ఏపీలో మహిళలు మాత్రమేకాదు అందరూ సురక్షితంగా ఉన్నారు. నా ఆశయం కోసం ముఖ్యమంత్రి గారు నాకు 10లక్షల రూపాయలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. నేను తిరుపతి వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించాను. అక్కడి నుంచి నాకు ప్రత్యేక రక్షణ అందించారు. స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మంచివి. జగన్మోహన్రెడ్డిలాంటి మఖ్యమంత్రి దేశానికే ఆదర్శం.