ఇస్రో బృందానికి సీఎం వైయస్ జగన్ అభినందనలు
14 Jul, 2023 15:26 IST
తాడేపల్లి: ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి విజయవంతంగా పంపించిన ఇస్రో బృందాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరొందిన ఎల్‌వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరిగింది. గ్లోబల్ మ్యాప్‌లో గర్వించదగిన స్థానాన్ని గెలుచుకుని కక్ష్యలో అంతరిక్ష నైపుణ్యంతో ముందుకు నడిపించే చంద్రయాన్ యాత్ర సాఫీగా,విజయవంతమైన ల్యాండింగ్ జరగాలని సీఎం వైయస్ జగన్ ఆకాంక్షించారు.