తారకరత్న మృతి పట్ల సీఎం వైయస్ జగన్ సంతాపం
తాడేపల్లి: సినీ నటుడు, ఎన్టీఆర్ మనవడు నందమూరి తారకరత్న మృతి పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు తారకరత్న కుటుంబ సభ్యులకు సీఎం వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన జనవరి 27న గుండెపోటుకు గురైనప్పటి నుంచి గత 23 రోజులుగా చికిత్స పొందుతూ కోలుకోలేక కన్నుమూశారు.
ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం: ఎంపీ విజయ సాయిరెడ్డి
సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం. కాని విధి మరోలా తలచింది. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నాను. అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.