చెవిరెడ్డికి ఛాతిలో నొప్పి
21 Jun, 2025 16:44 IST
విజయవాడ: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం చెవిరెడ్డికి గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో జిల్లా జైలు నుంచి చెవిరెడ్డిని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. దాదాపు రెండు గంటల పాటు.. పరీక్షలు చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం చెవిరెడ్డిని నేరుగా జిల్లా జైలుకు తరలించారు.