చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలి…
17 Feb, 2023 22:52 IST
తూర్పు గోదావరి: నిబంధనలను ఉల్లంఘించినందుకు చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. పోలీసు ఆజ్క్షలను చంద్రబాబు ధిక్కరిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. అనపర్తిలో నడిరోడ్డుపై సభ వద్దు, నిబంధనలు పాటించాలన్నందుకు చంద్రబాబు పెట్రేగిపోయాడని తప్పుపట్టారు. జీవో-1 అమల్లో ఉందని హైకోర్టు చెప్పినా.. చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు.
తనకు ప్రత్యేక రాజ్యాంగం ఉందని అనుకుంటున్నాడనిమంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
నడిరోడ్డుపై సభ వద్దన్నందుకు చంద్రబాబు డ్రామా మొదలుపెట్టాడని విమర్శించారు.
జెడ్ ప్లస్ కమాండోల రక్షణ ఉందని బరితెగిస్తున్నాడు: ఎమ్మెల్యే కన్నబాబు
11 మందిని చంపేసిన తర్వాతకూడా అదే పంథాలో చంద్రబాబు వెళ్లాలనుకుంటున్నాడు
చట్టంకన్నా తాను ఎక్కవ అని చంద్రబాబు అనుకుంటున్నాడని కన్నబాబు ఫైర్ అయ్యారు.