తిరుపతిలో "చంద్రబాబు ఘరానా మోసం"
26 Apr, 2025 10:02 IST
తిరుపతి: "చంద్రబాబు ఘరానా మోసం " పేరుతో కూటమి ప్రభుత్వం వైపల్యాలను తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఎండగట్టారు. సూపర్ సిక్స్ హామీలుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన తీరుపై మొబైల్ వెబ్ లింక్ ద్వారా 11నెలలు కాలంలో ఎంత నష్టపోయారో ప్రజలకు అభినయ్ రెడ్డి వివరించారు. శనివారం నగరంలోని లెనిన్ నగర్ లో "చంద్రబాబు ఘరానా మోసం కార్యక్రమం" ను భూమన అభినయ్ రెడ్డి ప్రారంభించారు. సూపర్ సిక్స్ ఉచిత హామీలను నమ్మి ప్రజలు మోసపోయామని మాతో నేరుగా చెప్తున్నారని అభినయ్ రెడ్డి తెలిపారు. జగనన్న పాలనలో మాకు సంక్షేమం పథకాలు లబ్ధి చేకూరాయి అని పేద ప్రజలు అంటున్నారని ఆయన చెప్పారు. భూమన అభినయ్‌రెడ్డి చేపట్టిన వినూత్న కార్యక్రమానికి నగర ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.