ప్రజలతో నిత్యం అనుసంధానంగా ఉండేలా పార్టీ నిర్మాణం

17 Jan, 2026 12:25 IST

అనంతపురం: ప్రజలతో నిత్యం అనుసంధానంగా ఉండేలా పార్టీ నిర్మాణం ఉండాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి (సమన్వయం) వజ్ర భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం నగరంలోని ఏ-7 కన్వెన్షన్ హాల్‌లో అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అధ్య‌క్ష‌త‌న‌ నిర్వహించిన అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్ర భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ అధినేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు గ్రామం నుంచి సచివాలయం వరకు కమిటీలను బలోపేతం చేయడం అత్యంత కీలకమన్నారు. ప్రతి కార్యకర్తకు స్పష్టమైన బాధ్యతలు అప్పగిస్తూ, ప్రజల సమస్యలపై నిరంతరం స్పందించేలా పార్టీ వ్యవస్థ ఉండాలని సూచించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు మరింత చురుకుగా పనిచేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ టాస్క్ ఫోర్స్ సభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు పేరం నరేష్ కుమార్ రెడ్డి,  పాల్గొని మాట్లాడారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి రానున్న రోజుల్లో ప్రజా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు, అలాగే అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి వైయ‌స్ఆర్‌సీపీ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.