ప్రజా సమస్యలపై సమిష్టిగా పోరాటం
పశ్చిమగోదావరి జిల్లా: ప్రజా సమస్యలపై సమిష్టిగా పోరాటం చేయాలని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తణుకు నియోజకవర్గం అత్తిలి మండలంలో ఈరోజు వైయస్ఆర్‌సీపీ కార్యకర్తల సమావేశం కారుమూరి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించగా, పార్టీ అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటుపై విస్తృతంగా చర్చ జరిగింది. సమావేశంలో వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని మరింత బలంగా నిలబెట్టేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అనుబంధ విభాగాల ద్వారా ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్గనైజేషన్ పార్టీ సెక్రటరీ వజ్ర విజయభాస్కర్ రెడ్డి హాజరయ్యారు. అలాగే పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణ రాజు కూడా పాల్గొని పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై కీలక సూచనలు చేశారు.