ప్రతి ఇంటికి మంత్రి, ఎమ్మెల్యే వెళ్లాలి
అమరావతి: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతి మంత్రి, ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కేబినెట్ అజెండా అనంతరం గడప గడపకు మన ప్రభుత్వంపై చర్చించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. ఖచ్చితంగా ప్రతి ఇంటికి మంత్రి, ఎమ్మెల్యే వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వివరించాలని వైయస్ జగన్ సూచించారు. ప్రజలు సమస్యలు వివరిస్తే తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కెబినెట్ »ô టీలో లాజిస్టిక్ పాలసీలో సవరణ చేస్తూ ఆమోదం తెలిపారు. ఎగుమతులు రెట్టింపు చేసేలా ఎక్సోపోర్ట్ చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు మత్స్యకార భరోసా, 15న రైతు భరోసాకు కేబినెట్ ఆమోదం తెలిపింది.