కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభం
12 May, 2021 11:43 IST
విజయవాడ: కరోనా నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కురసాల కన్నబాబు, పలువురు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, మెడిసిన్, వ్యాక్సినేషన్ వేగవంతంపై వంటి పలు అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చిస్తోంది.