కరోనా కట్టడిపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
28 Apr, 2021 12:39 IST
విజయవాడ: కోవిడ్ నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో మంగళగిరిలోని ఏపీఐఐసీ బిల్డింగ్‌లోని ఆరవ అంతస్థులో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. 104 కాల్ సెంటర్ సేవలను పటిష్టపర్చడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు అందుతున్న వైద్యం సేవలు, వ్యాక్సినేషన్ వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.