సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ ప్రారంభం

14 Mar, 2023 12:42 IST

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ సమావేశం కొనసాగుతోంది. 2023–24 బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం, స్పీకర్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. శాసనసభ, శాసన మండలిలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై కేబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నారు.