సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం
               7 Sep, 2022 11:38 IST            
                    సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణపై చర్చించనున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదే విధంగా రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీలో రూ.81 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం, విశాఖలో పేదల ఇళ్ల నిర్మాణంపై, గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై చర్చించనున్నారు.