రేపు మంత్రివర్గ విస్తరణ
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రేపు జరగనుంది. రేపు మధ్యాహ్నం 1:29 నిమిషాలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ప్రస్తుత కేబినెట్‌లో సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు వారి మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిన్ననే ఆమోదించారు. ఈ మేరకు మంత్రి వర్గంలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయించారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటలకు సీఎం వైయస్ జగన్ రాజ్‌భవన్ చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:29 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.