సంక్షేమ పథకాలు అందాలంటే లంచం ఇవ్వాలా?
విజయనగరం: చంద్రబాబు హయాంలో ఆంధ్రరాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఇసుక నుంచి మట్టి వరకు అంతా మాఫియాగా మారిందన్నారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకుంటున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు అందాలంటే లంచం ఇస్తేనే గానీ పని జరగని పరిస్థితులున్నాయన్నారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ, 108, 104, ఆసరా పెన్షన్లు అటకెక్కాయన్నారు. మరో వంద రోజుల్లో రాజన్న పాలన వస్తుందన్నారు. ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరుతాయన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల ఆశీర్వాదం మెండుగా ఉందన్నారు. వైయస్ జగన్ సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.