బ్రహ్మనాయుడి అరెస్టు అక్రమం
పల్నాడు: మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ సీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టును నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధితుల్ని వెంటాడి అరెస్టు చేయడం అన్యాయం. అసలు బ్రహ్మనాయుడుపై ఆరోపిస్తున్న ఆ భూమికి సంబంధించి అవకతవకల్ని బయటకు తీసుకొచ్చిందే బ్రహ్మనాయుడుగారి మనుషులు. నేరుగా అగ్రిమెంట్లో కూడా ఎక్కడా ఆయన లేరు. బొల్లా బ్రహ్మనాయుడు బంధువు రమేష్.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లను నమ్మి అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ పూర్తిగా రమేష్ పేరు మీదే ఉంది. ఎంతకీ భూముల రిజిస్ట్రేషన్ కు ముందుకు రాకపోవడంతో అనుమానం వచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఆరా తీస్తే, నకిలీ జీవోల ద్వారా అమ్మేందుకు ప్రయత్నించారని తేలింది. ఈ ఉదంతంలో నష్టపోయింది బొల్లా బ్రహ్మనాయుడు బంధువు రమేష్. కానీ అన్యాయంగా బ్రహ్మనాయుడును ఇందులో ఇరికించారు. బ్రహ్మనాయుడు కేవలం రమేష్ కు ఆర్థిక సహాయం మాత్రమే చేశారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఏమాత్రం తీసుపోవడం లేదు. అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నది కూడా ఇక్కడివారేనని తేలిపోతోంది. రాజకీయ కక్షను మనసులో పెట్టుకుని బ్రహ్మనాయుడిని అరెస్టు చేయడం దుర్మార్గం. అన్యాయాలు, అక్రమాలు చేయాల్సిన అవసరం, అంతటి దౌర్భాగ్యం బ్రహ్మనాయుడుకు లేదు.
-