ఏపీ అప్పుల తప్పుడు లెక్కలపై గవర్నర్‌కు ఫిర్యాదు 

8 Apr, 2026 16:06 IST

 తాడేపల్లి: కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నేత, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఏపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పూర్తి వాస్తవాలు, గణాంకాల వివరాలతో బుధవారం ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ఓ లేఖ రాశారాయన.  
ఏటేటా కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. విపరీతంగా అప్పులు చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారు. వివిధ కార్పొరేషన్ ల ద్వారా కూడా భారీగా అప్పు చేస్తున్నారు. కానీ ఆ వివరాల్లో తప్పుడు సమాచారం చూపుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న తప్పుడు సమాచారంపై చర్యలు తీసుకోవాలి అని బొత్స మొత్తం ఏడు పేజీల ఆ ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.